![]() |
![]() |

శ్రీదేవి డ్రామా కంపెనీలో లాస్ట్ సెగ్మెంట్ మాత్రం చాలా స్మూత్ గా... విడాకులు తీసుకోవాలని అనుకునే యాదమ్మ రాజు- స్టెల్లాకు మంచి కనువిప్పు కలిగించేదిలా ప్లాన్ చేశారు. ఈ షోకి వచ్చిన జోడీస్ ఫొటోస్ ని స్క్రీన్ మీద చూపించారు. వాటి వెనక ఉన్న స్టోరీని ఆ జోడీస్ చెప్పారు. నగేష్-ప్రీతినిగమ్ ఫోటో చూపించేసరికి "పెళ్లయ్యాక మేము ఒక టెంపుల్ కి వెళ్లాం...కలిసి ఉంటే కలదు సుఖం అంటారు..కానీ నిజంగా కలిసి ఉంటే చాల హ్యాపీగాఉంటుంది" అని చెప్పారు వాళ్ళు. శ్రీవాణి-విక్రమ్ ఫోటో చూసేసరికి అందరూ షాకయ్యారు. "విక్రమ్ గారికి పోలిక కనిపిస్తోంది కానీ వాణి అప్పటికి ఇప్పటికి ఇంత మార్పా అని ఇంద్రజ అడిగేసరికి మా ఆయనకు బోరు కొడుతూ ఉంటుంది అని అప్పుడప్పుడు మారిపోతూ ఉంటాను ..పంజాగుట్ట ఫ్లైఓవర్ కూలిపోయిన రోజున మా రిసెప్షన్ జరిగింది..
అప్పుడు ఫుల్ వర్షం కూడా" అని చెప్పింది శ్రీవాణి. తర్వాత సత్తిపండు పెళ్లి ఫోటో చూపించారు. "1995 లో పెళ్లయ్యింది. అప్పుడంటే అంత ఫొటోగ్రఫీ అదీ పెద్ద అందుబాటులో లేదు..అందులోనూ నేను కేర్ తీసుకోలేదు. అప్పటికి నాకు పెళ్లి ఇష్టం లేదు..సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుందాం అనుకున్నా. మా అమ్మకు నేనొక్కడినే..మా మేనత్తా వాళ్ళది పెద్ద ఫామిలీ. అందుకే ఈమెను ఇచ్చి పెళ్లి చేశారు. కానీ ఆమె నా లైఫ్ లోకి వచ్చాకే నాకు బిఈడి సీట్ వచ్చింది. ఎంఎస్సి మాథ్స్ సీట్ వచ్చింది. తర్వాత నేను టీచర్ గా కూడా సెలెక్ట్ అయ్యాను. అలా అక్కడ జాబ్ చేస్తూనే జబర్దస్త్ కి వచ్చేవాడిని. అప్పుడు కూడా ఈమె నన్ను ఇబ్బంది పెట్టలేదు." అని చెప్పాడు..."పెళ్లి ఇష్టం లేదు అంటూనే ఆ ఫోటోలో నవ్వుతూ ఉన్నది సత్తిపండే " అన్నారు నగేష్.."కారణమేంటి అని ఆయన ఎందుకు అలా ఉన్నారు" అని అందరూ అడిగేసరికి " ..ఆ శివాలయ మండపంలో ఒకేసారి నాలుగు పెళ్లిళ్లు జరుగుతున్నాయి...ఆరోజు ఫుల్ వర్షం, వరద" అని సత్తిపండు భార్య చెప్పేసరికి " ఐతే ఈ పెళ్లి ఆయనకు కానీ ప్రకృతికి కానీ ఇష్టం లేదన్నమాటా" అన్నాడు రాంప్రసాద్. చివరికి యాదమ్మ రాజు - స్టెల్లా పెళ్లి ఫోటో వేసేసరికి స్టెల్లా ఆ ఫోటో గురించి చెప్పుకొచ్చింది. "మాది ఇంటర్ క్యాస్ట్ కాబట్టి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం..మేమిద్దరం చాలా హ్యాపీ గా ఉన్నాం. ఏడేళ్లు ప్రేమించుకున్నాం కానీ పార్క్ కి కానీ పబ్బుకు కానీ వెళ్ళలేదు.." అని చెప్పారు. "మరి ఇంత ప్రేమ ఉన్నప్పుడు విడాకులు ఎందుకు అడిగావు అని రష్మీ అడిగేసరికి నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది..చాలా మంది యాదమ్మరాజు మీద ప్రాంక్ చేయమని అడిగారు దాంతో ఇలా ప్లాన్ చేసాం" అని చెప్పింది స్టెల్లా..దాంతో అందరూ షాకైపోయారు.
![]() |
![]() |